
క్యాచ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పొలార్డ్
బుమ్రా వేసిన 11 ఓవర్‌లో కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు..
లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత స్పీడ్‌స్టార్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 11 ఓవర్‌లో విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు. బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. (చదవండి: అద్భుతం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు!)
ఈ క్యాచ్ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు. అయినా క్యాచ్ అందుకున్న బుమ్రా పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూశాడు. అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పొలార్డ్ ఏందీ తొండాట అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఐపీఎల్‌లో బుమ్రా, పొలార్డ్ ఒకే జట్టు ( ముంబై ఇండియన్స్) ఆటగాళ్లేనన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యచేధనలో తడబడ్డ విండీస్ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. (చదవండి: నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!)
— Mushfiqur Fan (@NaaginDance) November 6, 2018