ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో నాల్గో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 19 సెంచరీలు పూర్తి చేసుకున్న టీమిండియా ఆటగాడిగా రికార్డు సాధించిన కొద్ది వ్యవధిలోనే మరో రికార్డును రోహిత్ నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
వన్డేల్లో సచిన్ 195 సిక్సర్లు కొట్టగా, ఇప్పుడు దాన్ని రోహిత్ సవరించాడు. పాల్ వేసిన 40 ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టడంతో సచిన్ సిక‍్సర్లు రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక్కడ ఎంఎస్ ధోని(211 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment