BCCI Updated Siddarth Kaul Added in the Team India Squad for 3rd IND Vs WI T20 Series in Chennai - Sakshi
Sakshi News home page

మూడో టీ20: సిద్దార్థ్‌ కౌల్‌కు అవకాశం

Published Fri, Nov 9 2018 11:29 AM | Last Updated on Fri, Nov 9 2018 3:07 PM

Siddarth Kaul Returns As India for 3rd T20 - Sakshi

సిద్దార్థ్‌ కౌల్‌

ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్‌ సిద్దార్థ్‌ కౌల్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్‌ చేసింది.

రంజీల్లో పంజాబ్‌ తరపున కౌల్‌ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్‌ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్‌.. వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్‌ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్‌కు ముందే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement