మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్
ప్రస్తుత ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్‌తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది.
ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్‌పై గెలిచినా సెమీస్‌కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక టాపర్‌గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment