
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment