మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది.
ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్‌రిన్‌పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్‌ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది.
మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment