వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అటు సీనియర్ జట్లు అయినా, ఇటు జూనియర్ టీమ్స్ అయినా రైవలరీ మాత్రం ఒకటే.
ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భాగంగా ఆక్టోబర్ 19న భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం 7:00 గంటలకు దాయాదుల పోరు షురూ కానుంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో భారత జట్టు యువ సంచలనం హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు.
అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రాన్ సింగ్, ఆయూష్ బదోని వంటి యువ ఆటగాళ్లు భారత జట్టులో భాగమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది.
తుది జట్లు(అంచనా)
భారత్ A: అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ, ఆయుష్ బడోని, నెహాల్ వధేరా, నిశాంత్ సింధు, రమణదీప్ సింగ్, రసిఖ్ సలామ్, వైభవ్ అరోరా, సాయి కిషోర్, రాహుల్ చాహర్
పాకిస్థాన్ A: మహ్మద్ హారీస్, యాసిర్ ఖాన్, హైదర్ అలీ, ఒమైర్ యూసుఫ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), ఖాసిం అక్రమ్, షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ ఇమ్రాన్, అబ్బాస్ అఫ్రిది, అహ్మద్ డానియాల్
Comments
Please login to add a commentAdd a comment