మహిళల టి20 ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టైటిల్ వేటను ఆరంభించనుంది. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లా నగరంలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా జట్లున్నాయి. జూలై 19న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 21న యూఏఈతో, 23న నేపాల్‌తో ఆడతాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి.
టాప్–10లో స్మృతి, హర్మన్‌ప్రీత్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్–10లో ఉన్నారు. గతవారం మూడో స్థానంలో ఉన్న స్మృతి ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment