శ్రీలంక గడ్డపై భారత జట్టు  | Asia Cup 2023: Indian Team arrives in Sri Lanka - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: శ్రీలంక గడ్డపై భారత జట్టు 

Published Thu, Aug 31 2023 2:53 AM | Last Updated on Thu, Aug 31 2023 9:58 AM

Indian team on Sri Lankan soil - Sakshi

కాండీ: ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్‌ జట్టు బుధవారం శ్రీలంకకు చేరుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం ముగిసిన తర్వాత టీమిండియా లంకకు బయల్దేరింది. నేరుగా విమానంలో కొలంబోలో దిగిన రోహిత్‌ శర్మ బృందం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాండీకి చేరుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మినహా ఇతర జట్టు సభ్యులంతా ఒకేసారి లంక గడ్డపై అడుగు పెట్టారు.

రాహుల్‌ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో భాగంగా శనివారం పల్లెకెలె మైదానంలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది. గురువారం శ్రీలంకకు చేరుకునే పాకిస్తాన్‌ ఒకరోజు విశ్రాంతి అనంతరం మ్యాచ్‌ బరిలోకి దిగనుండగా... సోమవారం పల్లెకెలె మైదానంలోనే నేపాల్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement