Hardik Pandya and Natasa Stankovic Holiday: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. ఈ క్రమంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యతో కలిసి థాయ్‌లాండ్‌లో వాలిపోయాడు.
ఫుకెట్‌లో కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. భార్యా, కొడుకుతో స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతూ సేదతీరుతున్నాడు. నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తూ
ఈ ముగ్గురూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను హార్దిక్ భార్య నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అగస్త్య ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
రన్నరప్‌తో సరి
కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకుంది. అయితే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ధోని సేన ఐదోసారి చాంపియన్‌గా అవతరించగా... వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న టైటాన్స్‌కు నిరాశే మిగిలింది.
విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ సారథిగా!
ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో తలపడింది. దీంతో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదితరులు ఇంగ్లండ్‌కు వెళ్లగా.. హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన.. జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం హార్దిక్ పాండ్యా మరోసారి మైదానంలో దిగనున్నాడు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పాండ్యా సారథ్యం వహించే అవకాశం ఉంది.
చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?
Comments
Please login to add a commentAdd a comment