Hardik Pandya Agrees To Pay Rs 5 Lakh To Get Shoes Back Unseen Video Viral - Sakshi
Sakshi News home page

లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్‌ కదా! 5 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసి.. వీడియో

Published Mon, Jun 19 2023 4:53 PM | Last Updated on Mon, Jun 19 2023 5:27 PM

Hardik Pandya Agrees to Pay Rs 5 Lakh to Get Shoes Back Unseen Video Viral - Sakshi

Hardik Pandya Wedding Unseen Video: పెళ్లంటే సందళ్లు.. ఆటపాటలు.. వదినామరదళ్లు- బావాబామ్మర్దుల సరదాలు.. వధూవరులు, వారి కుటుంబాలను దగ్గర చేసేందుకు ఆడే చిలిపి ఆటలు..   టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, భవిష్యత్‌ కెప్టెన్‌గా ఎదుగుతున్న హార్దిక్‌ పాండ్యా వివాహ వేడుకలో ఇలాంటి సన్నివేశాలెన్నో చోటు చేసుకున్నాయి.

తాజాగా అందులోని వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన పాండ్యా అనతికాలంలోనే భారత పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. సెర్బియన్‌ మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన అతడు.. 2020లో ఆమెను పెళ్లాడాడు. 

అప్పటికే నటాషా గర్భవతి కాగా.. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 14న హిందూ, క్రిస్టియన్‌ వివాహ పద్ధతిలో కొడుకు అగస్త్య సమక్షంలో అంగరంగా వైభవంగా హార్దిక్‌- నటాషాలు మరోసారి వివాహం చేసుకున్నారు.

ఈ వేడుకలో భాగంగా హార్దిక్‌ పాండ్యా వదిన, నటాషా తోటికోడలు ఫాంకురి శర్మ(కృనాల్‌ పాండ్యా భార్య) .. ‘‘జూతా చురాయి(పాదరక్షలు దాచిపెట్టడం)’’ పేరిట మరిదిని ఆటపట్టించింది. అడిగినంత డబ్బు కానుకగా ఇస్తేనే బూట్లు ఇస్తానంటూ మెలిక పెట్టింది.

ఈ సందర్భంగా లక్ష రూపాయలు ఇవ్వాలని హార్దిక్‌ను డిమాండ్‌ చేసింది. అయితే, ఇందుకు స్పందించిన హార్దిక్‌.. లక్ష కాదు ఏకంగా ఐదు లక్షలు ఇస్తానంటూ వదినమ్మను ఖుషీ చేశాడు. వెంటనే డబ్బును ఫాంకురి అకౌంట్‌కు బదిలీ చేయాలంటూ తమ వాళ్లకు చెప్పాడు. అయినప్పటికీ.. ఫాంకురి ఆటపట్టించడం మానలేదు. డబ్బు పూర్తిగా ట్రాన్స్‌ఫర్‌ అయిన తర్వాతే షూస్‌ ఇస్తానని చెప్పింది.

అలా సరదాగా సాగిన ఈ వేడకకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ అయిన హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌-2023లో తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ ఆఖరి మెట్టుపై చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓటమిపాలు కావడంతో డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు.

చదవండి: 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్‌ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement