
టీమిండియా(ఫైల్‌ఫోటో)
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే రెండు బ్యాచ్‌లగా లండన్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. అయితే మూడో బ్యాచ్‌గా లండన్‌కు వెళ్లాల్సిన శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.. అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ ఇప్పుడు కాస్త ఆలస్యంగా పయనం కానున్నారు.
ఎందుకంటే ఐపీఎల్-2023ల ఫైనల్ రిజర్వ్‌డేకు వాయిదా పడడంతో వీరి ప్రయాణం ఆలస్యం కానుంది. గిల్, షమీ, భరత్ గుజరాత్ జట్టులో భాగం కాగా.. జడేజా, రహానే సీఎస్‌కే తరపున ఆడుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముగిసిన వెంటనే వీరు ఐదుగురు సోమవారం లేదా మంగళవారం ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సింది.
కానీ ఇప్పుడు ఫైనల్ సోమవారం జరగనుండడంతో గిల్, షమీ ,జడేజా, రహానే, భరత్ మంగళవారం లేదా బుధవారం ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. కాగా వీరిముగ్గురు కాస్త ముందుగా ఇంగ్లండ్‌కు చేరివుంటే అక్కడి పరిస్ధితులను అలవాటు పడేందుకు వీలుగా ఉండేది. కానీ వీరి ప్రయాణం ఆలస్యం కావడంతో.. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అయితే గిల్, షమీ ,జడేజా త్రయం మాత్రం భారత జట్టులో చాలా కీలకం. కాగా జాన్7 నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్