రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతూలగించిన ఐపీఎల్-2023కు సోమవారంతో శుబం కార్డు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఉత్కంఠపోరు సిద్దమైంది. లండన్ వేదికగా జూన్ 7నుంచి జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా-భారత జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండో సారి. డబ్ల్యూటీసీ-2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఈ ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరగన్న ఫైనల్లో ఎలాగైనా విజయం సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ తుదిపోరు కోసం ఇప్పటికే రెండు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకున్న రోహిత్ సేన.. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది.
మరోవైపు ఈ ఫైనల్ కోసం టీమిండియా మూడో బ్యాచ్ కూడా ఇంగ్లడ్ గడ్డపై అడుగుపెట్టింది. అజింక్యా రహానే, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలతో కూడిన చివరి బ్యాచ్ బుధవారం లండన్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రీకర భరత్, రహానే సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఐపీఎల్-2023 ఫైనల్ కారణంగా ఈ ఐదుగురి ప్రయాణం ఆలస్యమైంది.
చదవండి: #MS Dhoni: కోకిలాబెన్ హాస్పిటల్‌కు వెళ్లనున్న ధోని.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment