పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా బాబర్ నిలిచాడు. పీఎస్‌ఎల్-2024 సీజన్‌లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఆజం ఇప్పటివరకు 78 ఇన్నింగ్స్‌లలో 3003 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్(2381) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 16 పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పెషావర్ బౌలర్లలో ఈర్షద్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. పెషావర్ బ్యాటర్లలో బాబర్ ఆజం(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment