పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. పెషావర్ జల్మీతో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 66; 9 ఫోర్లు, సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ రిలీ రొస్సో (36 బంతుల్లో 75; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రచ్చరచ్చ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మిల్లర్ (14 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), పోలార్డ్ (6 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు,సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. పెషావర్ బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 2, సుఫీయాన్ ముకీమ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన పెషావర్.. సుల్తాన్స్ బౌలర్లు ఉసామా (3/22), ఇహసానుల్లా (3/24), అబ్బాస్ అఫ్రిది (2/33), కార్లోస్ బ్రాత్‌వైట్ (1/22) ధాటికి 18.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.
అరంభంలో ఓపెనర్ మహ్మద్ హరీస్ (23 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ సయిమ్ అయూబ్ (37 బంతుల్లో 53; 3 సిక్సర్లు, 3 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యారు. వీరు కాక రోవమన్ పావెల్ (23), జేమ్స్ నీషమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ ప్లేయర్ రొస్సో వరుసగా రెండో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 18) మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment