
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్‌ను పెషావర్ జల్మీ ఓటమితో ఆరంభించింది. లహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో బాబర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. బాబర్ క్రీజులో ఉన్నంతసేపు పెషావర్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.
కానీ 15 ఓవర్‌లో ఆజం కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ క్వెట్టా మలుపు తిరిగింది. క్వెట్టా బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. అమీర్, వసీం, అకిల్ తలా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
You can't hit a six like that to 140+ KPH ball if you are not Babar Azam 🥵🔥#PSL2024 #BabarAzam𓃵pic.twitter.com/RB9uE1gVBF
— Hassan (@HassanAbbasian) February 18, 2024
Comments
Please login to add a commentAdd a comment