
ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అత్యుత్తమ క్రికెటర్ల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎవరికి వారే సాటి. అయితే కొంత మంది కోహ్లి కంటే బాబర్ అద్భుతమైన ఆటగాడని.. మరి కొంత మంది కోహ్లితో బాబర్‌కు పోలిక అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు కోహ్లి, బాబర్ సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. కవర్‌డ్రైవ్ షాట్ విషయంలో బాబర్, కోహ్లిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్న మిల్లర్‌కు ఎదురైంది. దానికి బదులుగా మిల్లర్ ఏమీ ఆలోచించకుండా బాబర్ బెటర్ అంటూ సమాధానం ఇచ్చాడు.
అంతే కాకుండా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మిల్లర్ పేర్కొన్నాడు. ఇక కోహ్లి బెటర్ కాదుంటూ మిల్లర్ చేసిన వాఖ్యలపై కింగ్ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా మిల్లర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నంత మాత్రాన బాబర్‌కు సపోర్ట్ చేస్తావా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా మిల్లర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ మూల్తాన్ సుల్తాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment