PSL 2022: Rashid Khan Smashes Helicopter Six Against Peshawar Zalmi - Sakshi
Sakshi News home page

Rashid Khan: కొట్టడం స్టార్ట్‌ చేస్తే ఇలాగే ఉంటుంది.. 

Published Thu, Feb 3 2022 3:20 PM | Last Updated on Thu, Feb 3 2022 6:10 PM

Rashid Khan Strikes Again Helicopter Shot Ball Out Of Stadium PSL 2022 - Sakshi

అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పీఎస్‌ఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తూ సిక్సర్లతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. తాజాగా పెషావర్‌ జాల్మితో మ్యాచ్‌లో రషీద్‌ 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లలో ఒకటి మాత్రం హైలెట్‌గా నిలిచింది. లాహోర్‌ ఖలండర్స్‌ ఇన్సింగ్స్‌లో సల్మాన్‌ రషీద్‌ ఆఖరి ఓవర్‌ వేశాడు. ఓవర్‌ రెండో బంతిని రషీద్‌ డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌ కొట్టాడు. దెబ్బకు బంతి వెళ్లి స్టేడియం అవతల పడింది.  దీనికి సంబంధించిన వీడియోను పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు తమ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ''డేంజర్‌ జోన్‌.. రషీద్‌ బంతిని పార్క్‌ అవతల పడేశాడు..'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ''రషీద్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. కొట్టడం స్టార్ట్‌ చేస్తే ఇలాగే ఉంటుంది'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

PSL 2022: 'నా కూతురు కోరిక.. అందుకే వింత సెలబ్రేషన్‌'

రషీద్‌ మెరుపులకు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లాహోర్‌ ఖలండర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌(66), షఫీక్‌(41 రాణించగా.. ఆఖర్లో మహ్మద్‌ హఫీజ్‌(19 బంతుల్లో 37 నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌(8 బంతుల్లో 22 నాటౌట్‌) మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్దే ఆగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement