పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన సుల్తాన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే రేంజ్‌లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇహసానుల్లా ఫైఫర్‌తో (4-1-12-5) గ్లాడియేటర్స్‌ను గడగడలాడించగా.. బ్యాటింగ్‌లో రిలీ రొస్సో మెరుపు హాఫ్‌సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.
A special performance from our young quick Ihsanullah as he takes 5 wickets for 12 runs!#SultanAaGayya #LetsPlaySaeen pic.twitter.com/8HVKfheWsu
— Multan Sultans (@MultanSultans) February 15, 2023
ఫలితంగా సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
.@Rileerr gets to his 5️⃣0️⃣
— PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023
Nothing can go wrong for @MultanSultans today 👏#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/a3lcm44BjR
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సుల్తాన్స్.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్ అఫ్రిది (2/27), సమీన్ గుల్ (2/20), ఉసామా మిర్ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (27), ఉమర్ అక్మల్ (11), మహ్మద్ నవాజ్ (14), హఫీజ్ (18), మహ్మద్ హస్నైన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
Cracking shot! @Rileerr making Multan roar 🎉#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/zazLskMwYm
— PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్.. షాన్ మసూద్ (3) వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేసి సుల్తాన్స్‌ను గెలిపించారు. షాన్ మసూద్ వికెట్ నువాన్ తుషారకు దక్కింది. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి.
Pace like fire! 🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/7UFeFx04kz
— PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023
Comments
Please login to add a commentAdd a comment