డుప్లెసిస్ (Photo Credit: IPL Twitter)
IPL 2023 RCB Vs CSK- Faf du Plessis: చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు.
టాప్‌లో డుప్లెసిస్
తద్వారా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి 259 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆరెంజ్ క్యాప్ అందుకుని టాప్‌లో కొనసాగుతున్నాడు. కాగా డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పంటిబిగువన నొప్పిని భరిస్తూనే
డెత్ ఓవర్లలో సీఎస్‌కే బౌలర్లు రాణించడంతో సొంతమైదానంలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డుప్లెసిస్ ఫిజియోలు వచ్చి అతడి పొట్ట చుట్టూ కట్టుకట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నొప్పిని పంటిబిగువన భరిస్తూనే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించేందుకు కృషి చేశాడంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరేం పర్లేదు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. ‘‘మ్యాచ్ ఆరంభంలో డైవింగ్ చేస్తున్న సమయంలో పక్కటెముకలకు దెబ్బ తలిగింది. నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. బ్యాటింగ్ చేయగలనా లేదోనన్న భయం వేసింది. కానీ అంత బాగానే జరిగింది’’ అని పేర్కొన్నాడు.
డీకే ఫినిష్ చేస్తాడనుకున్నా
సీఎస్‌కే బ్యాటర్లను కట్టడి చేసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని.. ఏదేమైనా దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దినేశ్ కార్తిక్(14 బంతుల్లో 28 పరుగులు) మ్యాచ్ ఫినిష్ చేస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాసలై పోయానని విచారం వ్యక్తం చేశాడు.
ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం
కాగా 38 ఏళ్ల సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ గతేడాది ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన అతడు.. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి కెప్టెన్‌గా తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.
ఐపీఎల్-2022లో 16 ఇన్నింగ్స్‌లో కలిపి 468 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆర్సీబీ తరఫున టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నా ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న డుప్లెసిస్ ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం అని అభిమానులు మురిసిపోతున్నారు.
చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని
తిలక్ ఇంట్లో సచిన్, రోహిత్, సూర్య సందడి.. ఫొటోలు వైరల్! ఎన్నటికీ మరువం!
.@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏
— IndianPremierLeague (@IPL) April 17, 2023
Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V
#DuPlessis
— ✨️ ❤ Kohli Fan Girl ❤ ✨️ (@kohlifangirl178) April 17, 2023
Only respect 🥺🙌
He has played in pain.#RCBvsCSK pic.twitter.com/ezLtgiycl9
Comments
Please login to add a commentAdd a comment