IPL 2023: RCB captain Faf du Plessis fined for INR 12 lakh after LSG match - Sakshi
Sakshi News home page

Faf du Plessis: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్‌.. భారీ జరిమానా

Published Tue, Apr 11 2023 10:08 AM | Last Updated on Tue, Apr 11 2023 11:10 AM

IPL RCB Vs LSG: RCB Captain Faf du Plessis Fined INR 12 Lakh After Loss - Sakshi

ఆర్సీబీ (PC: RCB Twitter/IPL)

Royal Challengers Bangalore vs Lucknow Super Giants: ఓటమి బాధలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు 12 లక్షల జరిమానా పడింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఈ మేరకు అతడికి నిర్వాహకులు ఫైన్‌ విధించారు.

కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది.

పూరన్‌ దెబ్బ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి పూరన్‌ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరి బాల్‌కు బై రూపంలో పరుగు రావడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. బెంగళూరు జట్టుకు ఇప్పటికే ఆన్‌ఫీల్డ్‌ పెనాల్టీ పడిన విషయం తెలిసిందే.

అప్పటికే పెనాల్టీ
స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆఖరి ఓవర్లో ఎక్స్‌ట్రా ఫీల్డర్‌ను ఇన్‌సైడ్‌ సర్కిల్‌లో ఉంచడం వల్ల డీప్‌ బౌండరీలో కేవలం నలుగురినే ప్లేస్‌ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆర్సీబీ కెప్టెన్‌కు జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.

‘చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా జరిమానా విధించాం. ఈ సీజన్‌లో ఆర్సీబీది తొలి తప్పిదం అయిన కారణంగా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు 12 లక్షల రూపాయలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: RCB Vs LSG: కనీసం బంతిని టచ్‌ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్‌ పనికిరాదు!
అయ్యో హర్షల్‌.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగి ఉంటేనా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement