
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో డుప్లెసిస్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఓపెనింగ్ జోడి అనవసర రికార్డు నమోదు చేసింది. సీజన్‌లో 10వ మ్యాచ్ ఆడుతున్న ఆర్‌సీబీ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ జోడి వరుసగా 50,1,5,50 పరుగులు జోడించింది. అయితే చివరి ఆరు మ్యాచ్‌ల్లో మాత్రం వరుసగా 14,5,7,10,11 పరుగులు జోడించారు.
మరో విషయమేంటేంటే.. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున టాప్-3 బ్యాట్స్‌మెన్లు ఆరుసార్లు డకౌట్ అయ్యారు. ఇందులో అనూజ్ రావత్ మూడుసార్లు, కోహ్లి రెండుసార్లు, డుప్లెసిస్ ఒకసారి డకౌట్ లిస్ట్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక జట్టు తరపున టాప్-3 బ్యాట్స్‌మెన్ ఎక్కువసార్లు డకౌట్ అయిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.
చదవండి: Rohit-Kohli: 'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా!
Comments
Please login to add a commentAdd a comment