Breadcrumb
SRH Vs RCB: మళ్లీ ఓడిన ‘రైజర్స్’.. 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
Published Sun, May 8 2022 2:48 PM | Last Updated on Sun, May 8 2022 7:26 PM
Live Updates
IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అప్డేట్స్
67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో 67 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ కోహ్లి డకౌట్ అయ్యాడు.
అయితే, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(73- నాటౌట్), రజత్ పాటిదార్(48), గ్లెన్ మాక్స్వెల్(33).. దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 30) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో డుప్లెసిస్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ మొదటి ఓవర్లోనే కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. పతనానికి బాటలు వేసుకుంది. రాహుల్ త్రిపాఠి ఒక్కడే అర్ధ శతకాన్ని నమోదు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా ఆర్సీబీ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ సన్‌రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్కోర్లు
ఆర్సీబీ-192/3 (20)
ఎస్ఆర్హెచ్- (19.2)
తొమ్మిదో వికెట్ డౌన్
హసరంగ ఐదో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
ముగింపునకు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్!
వనిందు హసరంగ మరోసారి రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. శశాంక్ సింగ్‌ను అవుట్ చేసి నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. హసరంగ బౌలింగ్‌లో మాక్సీకి క్యాచ్ ఇచ్చి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శశాంక్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
కార్తిక్ త్యాగి డకౌట్
కార్తిక్ త్యాగి రూపంలో సన్‌రైజర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతడు రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు: 114/7 (16).
శశాంక్ సింగ్, భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. ఆది నుంచి ఆచితూచి ఆడుతున్న రాహుల్ త్రిపాఠి(58) అవుటయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లామ్రోర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రైజర్స్ మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుత స్కోరు: 114/6 (15.4 ఓవర్లు)
మళ్లీ హసరంగ.. మూడో వికెట్
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ముచ్చటగా మూడో వికెట్ తీశాడు. జగదీశ సుచిత్‌ను అవుట్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. రైజర్స్ ప్రస్తుత స్కోరు: 104/5 (14.3)
అర్ధ శతకం పూర్తి చేసుకున్న రాహుల్ త్రిపాఠి
ఓవైపు టపటపా వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడుతున్నాడు రాహుల్ త్రిపాఠి. 14వ ఓవర్ మొదటి బంతికే సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం త్రిపాఠి(55), జగదీశ సుచిత్(2) క్రీజులో ఉన్నారు.
పూరన్ అవుట్.. సంబరాల్లో ఆర్సీబీ
వనిందు హసరంగ మరోసారి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న నికోలస్ పూరన్‌ను అవుట్ చేశాడు. బిగ్ వికెట్ దక్కించుకున్నాడు. కాగా హసరంగ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చిన పూరన్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
13 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు- 93/4
12 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ స్కోరు?
నికోలస్ పూరన్(19), రాహుల్ త్రిపాఠి(46) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ స్కోరు: 89/3.
మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
ఎయిడెన్ మార్కరమ్ రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. వనిందు హసరంగ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మార్కరమ్ అవుటయ్యాడు. త్రిపాఠితో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అతడు 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జట్టు స్కోరు: 51/3 (8.2 ఓవర్లు).
5 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ స్కోరు: 28-2
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రాహుల్ త్రిపాఠి(14), మార్కరమ్(14) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ స్కోరు: 28-2
ఆరంభంలోనే రైజర్స్‌కు భారీ షాక్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్ మాక్స్వెల్ బౌలింగ్‌లో మొదటి బంతికే కెప్టెన్ కేన్ విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో బంతికి అభిషేక్ శర్మ బౌల్డ్ అయ్యాడు.
దీంతో తొలి ఓవర్లో హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్ ముగిసే సరికి స్కోరు: 1-2. మార్కరమ్, రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నారు.
పిచ్చి కొట్టుడు కొట్టిన దినేశ్ కార్తిక్
19వ ఓవర్ రెండో బంతికి మాక్సీ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న డీకే 1 ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు.
ఇక విరాట్ కోహ్లి(0) విఫలమైనప్పటికీ ఫాప్ డుప్లెసిస్(73- నాటౌట్), రజత్ పాటిదార్(48), గ్లెన్ మాక్స్వెల్(33).. దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 30) అద్భుతంగా రాణించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రైజర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
కాగా రైజర్స్ బౌలర్లలో జగదీశ సుచితకు రెండు, కార్తిక్ త్యాగికి ఒక వికెట్ లభించాయి.
మాక్స్వెల్ అవుట్
గ్లెన్ మాక్స్వెల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో మార్కరమ్కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు.
డుప్లెసిస్ దూకుడు.. మాక్సీ సహకారం
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు పిండుకుంటున్నాడు. మరో ఎండ్‌లో మాక్స్వెల్ అతడికి సహకారం అందిస్తున్నాడు.
18వ ఓవర్ ముగిసే సరికి డుప్లెసిస్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70, మాక్సీ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు: 156/2 (18)
15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు?
గ్లెన్ మాక్స్వెల్ 16, డుప్లెసిస్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు 125-2.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
రైజర్స్ స్పిన్నర్ జగదీశ సుచిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్(48)త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డీప్ మిడ్ వికెట్లో ఉన్న త్రిపాఠి వేగంగా స్పందించి క్యాచ్ పట్టడంతో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది.
డుప్లెసిస్ అర్ధ శతకం
ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రైజర్స్ బౌలర్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఫోర్ బాది ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతేగాక రజత్తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 105/1
అర్ధ సెంచరీకి చేరువగా..
ఫాప్ డుప్లెసిస్(47), రజత్ పాటిదార్(47) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీలకు చేరువయ్యారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 98-1
ఉమ్రాన్ బౌలింగ్‌లో దంచి కొట్టిన డుప్లెసిస్
స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ను డుప్లెసిస్ చీల్చి చెండాడాడు. ఎనిమిదో ఓవర్ నాలుగో బంతికి ఫోర్ బాదిన ఆర్సీబీ కెప్టెన్.. తర్వాత మరో బౌండరీతో పాటు సిక్సర్ కొట్టాడు. అంతుకుముందు రజత్ ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తంగా 20 పరుగులు రాబట్టారు. దీంతో 8వ ఓవర్ ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 77-1
అయ్యో కార్తిక్!
సన్‌రైజర్స్ బౌలర్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్, రజత్ చితక్కొట్టారు. దీంతో ఆరో ఓవర్లో ఆర్సీబీకి మొత్తంగా 17(వరుసగా 6 1 4 0 1 వైడ్ 4) పరుగులు వచ్చాయి. దీంతో స్కోరు 47కు చేరింది.
ఆ తర్వాత సుచిత్ బౌలింగ్‌లో 10 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 57-1.
5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 30/1
ఆర్సీబీ బ్యాటర్లు రజత్ పాటిదార్, ఫాఫ్ డుప్లెసిస్ ఆచితూచి ఆడుతున్నారు. కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరడంతో క్రీజులోకి వచ్చిన రజత్ 18 పరుగులతో, కెప్టెన్ డుప్లెసిస్ 9 పరుగులతో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 30/1
వారెవ్వా సుచిత్..
సన్‌రైజర్స్ అటాక్ ఆరంభించిన మైసూర్ బౌలర్ జగదీశ సుచిత్ అదరగొట్టాడు. తొలి బంతికే కోహ్లిని డకౌట్ చేసిన అతడు.. తర్వాత కూడా కట్టుదిట్టంగా(వరుసగా వైడ్, 1, 0,0,0,0) బౌలింగ్ చేశాడు. దీంతో తొలి ఓవర్లో ఆర్సీబీ వికెట్ నష్టానికి కేవలం రెండే పరుగులు చేసింది.
కోహ్లి డకౌట్
ఆర్సీబీతో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన సన్‌రైజర్స్ బౌలర్ జగదీశ సుచిత్ మొదటి బంతికే వికెట్ తీశాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ విరాట్ కోహ్లి డకౌట్ అయ్యాడు. విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
సంతోషంగా ఉంది..
‘‘కేన్‌తో పోటీలో టాస్ గెలవడం సంతోషంగా ఉంది. సాధారణంగా అతడే ఎప్పుడూ గెలుస్తూ ఉంటాడు కదా! మా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. సిరాజ్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో మైదానంలో దిగనుంది.
#RCB have won the toss and they will bat first against #SRH.
— IndianPremierLeague (@IPL) May 8, 2022
Live - https://t.co/tEzGa6a3Fo #SRHvRCB #TATAIPL pic.twitter.com/RKKros4phJ
టాస్ గెలిచిన ఆర్సీబీ
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు తెలిపాడు.
రసవత్తర పోరు
ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదివారం(మే 8) తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌లలో ఆర్సీబీ 6 విజయాలు సాధించింది.
తద్వారా 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ జట్టు పదింట 5 విజయాలతో పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
Related News By Category
Related News By Tags
-
IPL 2022: వారి స్థానంలో తుది జట్టులోకి ఆ ఇద్దరు: విలియమ్సన్
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ స్థానంలో ఫజల్హక్ ఫారూకీ,...
-
IPL 2022: మాకిది గొప్ప సీజన్.. గర్వంగా ఉంది: డుప్లెసిస్
‘‘ఆర్సీబీకి ఇది గ్రేట్ సీజన్. నాకు చాలా గర్వంగా ఉంది. మొదటి సీజన్లోనే ఇక్కడిదాకా తీసుకువచ్చినందుకు! ఎక్కడికెళ్లినా మా అభిమానులు మా వెంటే ఉన్నారు. మాకు మద్దతు తెలపడానికి ఇక్కడిదాకా వచ్చిన ప్రతి ఒక్క...
-
IPL 2022: సమఉజ్జీలు.. అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే...
IPL 2022 Qualifier 2 RR Vs RCB: మరోసారి విజేతగా నిలవాలనే కసితో రాజస్తాన్ రాయల్స్... కనీసం ఈసారైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి....
-
IPL 2022: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వాళ్లదే.. కారణం ఏమిటంటే!
IPL 2022 Eliminator LSG Vs RCB Winner Prediction: ఐపీఎల్-2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
-
IPL 2022: చిత్రంగా లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా?
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. టైటిల్ రేసులో నిల...
Comments
Please login to add a commentAdd a comment