IPL2024 RCB vs SRH Live Updates:
హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి..
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్‌క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్
181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5
13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5
ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్‌లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్‌కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్‌లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు..
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు.
సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్‌క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 277 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్‌లు బాదారు.
ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్
233 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్‌లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 217/2
16 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్‌క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్‌క్రమ్(2) పరుగులతో ఉన్నారు.
ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ..
ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్..
108 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు.
దంచి కొడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు..
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు.
ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ
ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు.
దంచి కొడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్‌వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.
ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్‌రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment