IPL 2023 RCB Vs LSG: Batting First Was Important, Says Faf du Plessis - Sakshi
Sakshi News home page

అదే మాకు కలిసొచ్చింది.. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని: డుప్లెసిస్‌

Published Tue, May 2 2023 12:30 PM | Last Updated on Tue, May 2 2023 12:55 PM

RCB vs LSG: Batting first was important, says Faf du Plessis - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా వాజ్‌పేయి ఎక్‌నా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కాపాడుకోగలిగారు.

127 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఇక సంచలన విజయంపై మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. లక్నో వంటి వికెట్‌పై తొలుత బ్యాటింగ్‌ చేయడం తమకు కలిసొచ్చిందని డుప్లెసిస్‌ తెలిపాడు. 

"మా హోం గ్రౌండ్‌ చిన్నస్వామి వికెట్‌కు ఇక్కడి వికెట్‌ పూర్తి వ్యతిరేకం. మేము ఈ మ్యాచ్‌లో తొలత 6 ఓవర్లు బాగా ఆడాం. విరాట్‌తో కలిసి కీలక భాగస్వా‍మ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. అదే మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అనుకుంటా. ఎందుకంటే మిడిల్‌ ఓవర్లలో బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పిచ్‌లపై తొలుత బ్యాటింగ్‌ చేయడం చాలా ముఖ్యం.

135 పరుగులు చేస్తే చాలు ఈ వికెట్‌పై మంచిస్కోర్‌ అవుతుందని భావించాను. ఇదే విషయం నేను కార్తీక్‌ మాట్లాడుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మేము అనుకున్న మార్క్‌ను అందుకోలేకపోయాము. అయినప్పటికీ ఫీల్డ్‌లో అడుగుపెట్టేటప్పుడు మా బాయ్స్‌తో ఒకే విషయం చెప్పాను.

ఈ స్కోర్‌నే మ్యాచ్‌ విన్నింగ్‌ స్కోర్‌గా భావించండి అని చెప్పా. ఆ మాత్రం స్కోర్‌ సాధిస్తే విజయం మాదే అని ముందే ఊహించా. ఇక మా బౌలర్లు అద్భుతం‍గా రాణించారు. జోష్‌, కరుణ్‌ చాలా బౌలింగ్‌ చేశారు. ఇక ఇదే రిథమ్‌ను మా తర్వాతి మ్యాచ్‌ల్లో కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం" అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో  డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.
చదవండి: #Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement