ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్నిఅందుకుంది. 182 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.
ఫిల్ సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు విధ్వంసం సృష్టించగా.. రిలీ రొసౌ 22 బంతుల్లో 35 నాటౌట్, మిచెల్ మార్ష్ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్, హాజిల్‌వుడ్, కర్ణ్‌శర్మలు తలా ఒక వికెట్ తీశారు.
విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా పయనిస్తోంది. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 83, రిలీ రొసౌ 26 పరుగులతో ఆడుతున్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 16 పరుగులు కావాలి
13 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 151/2
13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 75, రిలీ రొసౌ 21 పరుగులతో ఆడుతున్నారు.
మిచెల్ మార్ష్(26)ఔట్.. రెండో వికెట్ డౌన్
26 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో లామ్రోర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 64, రొసౌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఫిల్ సాల్ట్ మెరుపు అర్థశతకం.. ఢిల్లీ 115/1
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో మెరుపు అర్థశతకం సాధించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. మార్ష్ 22 పరుగులతో సహకరిస్తున్నాడు
టార్గెట్ 182.. దంచుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 22 పరుగులు చేసి వార్నర్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
లామ్రోర్ మెరుపులు.. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 181/4
ఆర్‌సీబీ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి 55 పరుగులు చేయగా.. మహిపాల్ లామ్రోర్(29 బంతుల్లో 54 నాటౌట్, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెరొక వికెట్ తీశారు.
Photo Credit : IPL Website
కోహ్లి (55)ఔట్.. ఆర్‌సీబీ 137/3
ఆర్‌సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి సీజన్‌లో ఆరో అర్థసెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న కోహ్లి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు ఉన్నాయి. 55 పరుగులు చేసిన కోహ్లి ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Photo Credit : IPL Website
మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డక్.. వరుస బంతుల్లో రెండు వికెట్లు
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ మార్ష్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత 45 పరుగులు చేసిన డుప్లెసిస్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్‌ను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగడంతో ఆర్‌సీబీ రెండో వికెట్ కోల్పోయింది.
Photo Credit : IPL Website
7 ఓవర్లలో ఆర్‌సీబీ 57/0
ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. కోహ్లి 25, డుప్లెసిస్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
Photo Credit : IPL Website
4 ఓవర్లలో ఆర్‌సీబీ 23/0
4 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కోహ్లి 20, డుప్లెసిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ
ఐపీఎల్ 16వ సీజన్‌లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా 50వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఆర్‌సీబీ టాప్-4లో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు 29 సార్లు తలపడగా.. 18 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ.. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక కోట్లా మైదానంలో ఆర్‌సీబీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఢిల్లీతో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరింటిని నెగ్గడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment