
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు.
ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.
No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐
Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024