ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఈ ఏడాది సీజన్‌లో కోహ్లికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే తన స్ట్రైక్ రేటుపై విమర్శల చేస్తున్న వారికి కోహ్లి గట్టి కౌంటిరిచ్చాడు.
"నా స్ట్రైక్ రేట్, ఆట గురించి మాట్లాడే వ్యక్తుల గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే జట్టు కోసం, మ్యాచ్ గెలవడానికి ఏమో చేయాలో నాకు తెలుసు. జట్టులో నా పాత్రపై నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఆడే జట్టును గెలిపించడానికి 100 శాతం ఎఫెక్ట్ పెడతాను
గత 15 ఏళ్లగా అదే చేస్తున్నాను. ఎక్కడో కూర్చోని మాట్లాడేవారు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి వ్యక్తిల స్వంత ఆలోచనలు, వారి ఊహలతో నాకు సంబంధం లేదు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడమే నా లక్ష్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కోహ్లి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment