IPL 2023 RCB Vs DC Bengaluru: Toss, Playing XI, Live Updates and Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB Vs DC Live Updates: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ గెలుపు

Published Sat, Apr 15 2023 2:45 PM | Last Updated on Sat, Apr 15 2023 7:21 PM

IPL 2023 RCB Vs DC Bengaluru: Toss Playing XI Updates And Highlights - Sakshi

Royal Challengers Bangalore vs Delhi Capitals Updates: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ గెలుపు
సొంతమైదానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గర్జించింది. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐపీఎల్‌-2023లో రెండో విజయం నమోదు చేసింది.

కోహ్లి అర్ధ శతకం
ఐపీఎల్‌-2023లో భాగంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ శుభారంభం అందించారు. 

కోహ్లి అర్ధ శతకంతో మెరువగా.. డుప్లెసిస్‌ 22 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహిపాల్‌ లామ్రోర్‌ 26, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 24 పరుగులు చేశారు. హర్షల్‌ పటేల్‌ 6 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. షాబాజ్‌ అహ్మద్‌ (12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు.

ఇక దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. అనూజ్‌రావత్‌ 22 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ మార్షల్‌, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఒకటి, లలిత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.   

ఆదుకున్న మనీశ్‌ పాండే.. కానీ
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని మనీశ్‌ పాండే అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా వాళ్లలో అక్షర్‌ పటేల్‌(21), అన్రిచ్‌ నోర్జే(23 నాటౌట్‌) మాత్రమే 20 పరుగుల మార్కు అందుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు.

విజయ్‌కుమార్‌ వైషాక్‌ అరంగేట్రంలోనే అదుర్స్‌
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ అరంగేట్ర బౌలర్‌ విజయ్‌కుమార్‌ వైషాక్‌ 3 వికెట్లతో చెలరేగడం విశేషం. ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్లలో సిరాజ్‌కు రెండు, పార్నెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. 

17.3: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన అమన్‌ హకీం ఖాన్‌(18).

15.5: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
విజయ్‌కుమార్ వైషాక్ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌(4) అవుట్‌. స్కోరు: 110/8 (15.5)

అర్ధ శతక హీరో అవుట్‌
13.6: హసరంగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మనీష్‌ పాండే(50). ఫలితంగా ఏడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ. స్కోరు: 98/7 (14)

ఆరో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
12.2: విజయ్‌కుమార్ వైషాక్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన అక్షర్‌ పటేల్‌(21). స్కోరు: 81/6 (12.3)

12 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు: 76/5

9 ఓవర్లలో ఢిల్లీ స్కోరు:  53-5
8.5: హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ పోరెల్‌(5) అవుట్‌.

పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు: 32-4
5.4: విజయ్‌కుమార్ వైషాక్ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆదిలోనే ఢిల్లీకి ఊహించని షాక్‌.. మూడో వికెట్‌ డౌన్‌(2/3 (2.2))
2.2: సిరాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన యశ్‌ ధుల్‌(1). మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌. వార్నర్‌, మనీశ్‌ పాండే క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ స్కోరు: 2/2 (2)
వార్నర్‌, యశ్‌ ధుల్‌ ఒక్కో పరుగుతో క్రీజులో ఉన్నారు.

1.4: రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
పార్నెల్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్షెల్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. 

ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌
0.4: రనౌట్‌గా వెనుదిరిగిన ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా. సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్లు వార్నర్‌, షా పరుగుకు యత్నించగా అనూజ్‌ రావత్‌ పాదరసంలా కదిలి.. బంతిని వికెట్లకు గిరాటేశాడు. దీంతో షా రనౌట్‌ కాగా.. అతడి రూపంలో ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 1-1. 
 

ఆర్సీబీ స్కోరు: 174/6 (20)
18 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 154-6
అనూజ్‌ రావత్‌, షాబాజ్‌ అహ్మద్‌ క్రీజులో ఉన్నారు.

14.2: కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌. ఆరో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
14.1: కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ అవుట్‌. ఆర్సీబీ స్కోరు: 132/5 (14.1)

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
13.6: అక్షర్‌ పటేల్‌ బౌలిం‍గ్‌లో హర్షల్‌ పటేల్‌ అవుట్‌.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
12.3: మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ అభిషేక్‌ పోరెల్‌కు క్యాచ్‌ ఇచ్చి మహిపాల్‌ లామ్రోర్‌(26(18) [6s-2])అవుట్‌. మాక్స్‌వెల్‌, హర్షల్‌ పటేల్‌ క్రీజులో ఉన్నారు.

12 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 110/2
మహిపాల్‌ (20), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌
10.1: అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి అవుట్‌
లలిత్‌ యాదవ్‌ బౌలింగ్‌లో యశ్‌ ధుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన విరాట్‌ కోహ్లి (50(34) [4s-6 6s-1])

9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 70/1
50 పరుగుల మార్కు అందుకున్న ఆర్సీబీ

7 ఓవర్లలో స్కోరు: 54-1

పవర్‌ప్లేలో ఆర్సీబీ ఇలా: 47/1 (6)

ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 43/1 (5)
కోహ్లి (19) ,మహిపాల్‌ (1) క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
4.4: మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌(22(16)) అవుట్‌. అమన్‌ హకీం ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన బెంగళూరు కెప్టెన్‌.

మూడో ఓవర్లో ఇలా: 26-0
2.3: ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో మరో ఫోర్‌ కొట్టిన డుప్లెసిస్‌
2.2: ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన డుప్లెసిస్‌

రెండో ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 16/0 (2)
కోహ్లి 12, డుప్లెసిస్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మొత్తంగా ఐదు పరుగులు మాత్రమే ఇచ్చిన అక్షర్‌ పటేల్‌.

తొలి ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 11-0
0.3: మరోసారి బౌండరీతో మెరిసిన కోహ్లి
0.2: నోర్జే బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన కోహ్లి

ఐపీఎల్‌-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బెంగళూరులో జరుగుతున్న శనివారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.  ఢిల్లీ జట్టులోకి మిచెల్‌ మార్ష్‌ రాగా.. స్పిన్నర్‌ వనిందు హాసరంగా ఆర్సీబీ జట్టులోకి చేరాడు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. ఢిల్లీ ఇంకా ఖాతా తెరవలేదు.

తుదిజట్లు(Playing XI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement