IPL 2023: Stoinis, Pooran played well through the middle overs, says Faf du Plessis - Sakshi
Sakshi News home page

IPL 2023: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్‌

Published Tue, Apr 11 2023 12:08 PM | Last Updated on Tue, Apr 11 2023 12:16 PM

Stoinis, Pooran played well through the middle overs says Faf Du Plessis - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో పరజాయం పాలైంది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కాపాడుకోలేకపోయింది.

ఆఖరి ఓవర్‌లో విజయానికి ఐదు పరుగులు కావల్సిన నేపథ్యంలో.. చివరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో గెలిపొందింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. మిడిల్‌ ఓవర్లలో పట్టు కోల్పోవడంతో మ్యాచ్‌ ఓడిపోయామని డుప్లెసిస్‌ తెలిపాడు.

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడం నిరాశ కలిగించింది. లక్నో బ్యాటర్లు మిడిల్‌ ఓవర్లలో అద్భుతంగా ఆడారు. అయితే ఒక బంతికి ఒక పరుగు కావల్సినప్పుడు.. కచ్చితంగా రనౌట్‌ వస్తుందని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు.  బెంగళూరు వికెట్‌ కూడా 7 -14 ఓవర్ల వరకు నెమ్మదిగా ఉంది. అందుకే వారు మిడిల్‌ ఓవర్లలో మా బౌలర్లను టార్గెట్‌ చేశారు.

ఆఖరి 5 ఓవర్లలో వికెట్‌ బౌలర్లకు కాస్త అనుకూలించింది. స్టోయినిష్‌, పూరన్‌ అద్భుతమైన షాట్‌లు ఆడారు. వారిద్దూ మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. హర్షల్‌ పటేల్‌ తన తొలి ఓవర్‌లో భారీగా పరుగులు ఇచ్చాడు. కానీ ఆఖరి ఓవర్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. అయితే డెత్‌ ఓవర్లలో ఎదో మ్యాజిక్‌ చేసి గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఎటువంటి బౌలర్‌కైనా డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం కష్టం.

ఇక మా ఇన్నింగ్స్‌లో నేను సగం వరకు బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. అందుకే కోహ్లికి సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ఇచ్చేశాను. మిడిల్‌ ఓవర్లలో ఎప్పడైతే రెండు మూడు షాట్లు ఆడానో నా రిథమ్‌ను తిరిగి పొందాను. తర్వాతి మ్యాచ్‌ల్లో ఇటువంటి తప్పిదాలు రిపీట్‌ కాకుండా ఆడుతామని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
చదవండి: Avesh Khan: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్‌’ ఖాన్‌కు ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement