
IPL 2024 MI vs RCB Live Updates:
ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ రెండో విజయం నమోదు చేసింది. వాంఖడే వేదికగా ఆర్సీబీ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు.
ముంబై మూడో వికెట్ డౌన్.. సూర్య ఔట్
సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన సూర్య.. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
సూర్యకుమార్ యాదవ్ ఫిప్టీ..
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కేవలం 17 బంతుల్లోనే తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 169/2
రెండో వికెట్ డౌన్..
139 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(34), హార్దిక్ పాండ్యా(7) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై..
101 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 10 ఓవర్లకు ముంబై స్కోర్: 111/1 క్రీజులో రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.
7 ఓవర్లకు ముంబై స్కోర్: 84/0
7 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(56) పరుగులతో ఉన్నారు.
4 ఓవర్లకు ముంబై స్కోర్: 32/0
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(8), ఇషాన్ కిషన్(22) పరుగులతో ఉన్నారు.
దినేష్ కార్తీక్ విధ్వంసం.. ముంబై టార్గెట్ 197 పరుగులు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దినేష్ కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 23 బంతుల్లోనే డీకే 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. వీరిద్దితో పాటు రజిత్ పాటిదార్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగగా.. ఆకాష్ మధ్వాల్, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు.
ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. ఆర్సీబీ ఎనిమిదో వికెట్ డౌన్
ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 21 పరుగులివచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 117/8. క్రీజులో దినేష్ కార్తీక్(36), ఆకాష్ దీప్(1) పరుగులతో ఉన్నారు.
బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ముంబై పేసర్ బుమ్రా దాటికి ఆర్సీబీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన బుమ్రా.. తొలుత ఫాప్ డుప్లెసిస్(61), మహిపాల్ లామ్రోర్ తర్వాత పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/6
15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 131/4
15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(58), దినేష్ కార్తీక్(6) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్.. మాక్సీ ఔట్
మాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 111/4
మూడో వికెట్ డౌన్..
రజిత్ పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. పాటిదార్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రజిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 26 బంతుల్లో 4 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేశాడు.
6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 44/2
6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(11), ఫాప్ డుప్లెసిస్(22) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
23 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విల్ జాక్స్.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
విరాట్ కోహ్లి ఔట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 3 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/1
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ మాత్రం ఏకంగా మూడు మార్పులు చేసింది. విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, విజయ్‌కుమార్ వైశాఖ్ ఆర్సీబీ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లొమ్రోర్, రీస్ టోప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్
Comments
Please login to add a commentAdd a comment