
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డలకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట బుమ్రా లిఖించుకున్నాడు. బుమ్రా కంటే ముందు ఎవరూ ఆర్సీబీపై ఫైవ్ వికెట్ల హాల్ సాధించలేదు. గతంలో ఆశిష్ నెహ్రా సీఎస్‌కే తరపున ఆడుతున్నప్పుడు ఆర్సీబీ 4 వికెట్ల ఘనత మాత్రమే నమోదు చేశాడు.
ఇక బుమ్రాకు ఇది ఐపీఎల్‌లో రెండో ఫైవ్ వికెట్ల హాల్ కావడం గమానార్హం. ఈ మ్యాచ్‌లో తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశాన్ని బుమ్రా కోల్పోయాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాడిని సైతం బుమ్రానే ఔట్ చేశాడు.
బుమ్రా తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అద్బుత ప్రదర్శనకు గాను బుమ్రాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
Jasprit Bumrah becomes the FIRST player to take an IPL fifer against RCB. pic.twitter.com/z5WmLlPbiF
— Kausthub Gudipati (@kaustats) April 11, 2024
Comments
Please login to add a commentAdd a comment