ఐపీఎల్-2024లో తన తొలి మ్యాచ్‌లో విఫలమైన ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్య భాయ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్కై వీరవీహరం చేశాడు.
ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. కాగా అతడికి ఇది తన ఐపీఎల్‌లో కెరీర్‌లోనే ఫాస్ట్‌స్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మిస్టర్ 360 నిలిచాడు.
ఈ జాబితాలో ఇషాన్ కిషన్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై కిషన్ కేవలం 16 బంతుల్లోనే ఆర్ధశతకాన్ని సాధించాడు. ఇక సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వెలకమ్ బ్యాక్ టూ సూర్యభాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం.
— Muskaan Bhatt (@MuskaanBhatt11) April 11, 2024
Comments
Please login to add a commentAdd a comment