టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. టీ20 క్రికెట్‌లో రైనా 172 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రైనా ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు అహ్హనించాడు.
Comments
Please login to add a commentAdd a comment