
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి మానవ్ సుత్తార్, జౌషువా లిటిల్ వచ్చారు. కాగా కాగా మానవ్ సత్తార్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం.
10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో పదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
Comments
Please login to add a commentAdd a comment