
సన్రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో 22 సిక్స్‌లు బాదిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.ఇంతకుముందు ఈ రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉండేది.
ఐపీఎల్-2013 సీజన్‌లో ఆర్సీబీ ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‍లో కొనసాగింది. అయితే తాజా మ్యాచ్‌తో 11 ఏళ్ల ఆర్సీబీ రికార్డును సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో సంచలనం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తన రికార్డునే తనే బ్రేక్ చేసింది. .ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్‌క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంతకుముందు ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 277 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
టీ20 హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్..
అదే విధంగా మరో రికార్డును కూడా ఎస్‌ఆర్‌హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20(అంతర్జాతీయ, లీగ్‌లు) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేసిన జట్టుగా సన్‍రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. నేపాల్ గతేడాది ఏషియన్ గేమ్స్ టోర్నీలో మంగోలియాపై 314 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్(287) పరుగులతో రెండో స్ధానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment