
ఐపీఎల్-2024లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(2), వృద్దిమాన్ సహా(1) తీవ్ర నిరాశపరిచారు. వీరిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్(6) పరుగులు చేశాడు. 19 పరుగులకే 3 విట్లుల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రమంలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
వీరితో పాటు రాహుల్ తెవాటియా(35) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment