IPL 2024 RCB vs PBKS Live Updates:
ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(77) కీలక పాత్ర పోషించాడు. కోహ్లితో పాటు దినేష్ కార్తీక్(10 బంతుల్లో 28), మహిపాల్ లామ్రోర్(8 బంతుల్లో17) సైతం అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్ ఫినిషర్‌గా మారాడు. వరుసగా బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్ బరార్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఐదో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్
130 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ డౌన్.. మాక్స్‌వెల్ ఔట్
103 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన మాక్స్‌వెల్.. బరార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రావత్ వచ్చాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 106/4, క్రీజులో కోహ్లి(64), రావత్(2) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్
87 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. బరార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మాక్స్‌వెల్ వచ్చాడు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 99/3, క్రీజులో కోహ్లి(63), మాక్స్‌వెల్(3) పరుగులతో ఉన్నారు.
విరాట్ కోహ్లి ఫిప్టీ..
విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కేవలం 31 బంతుల్లోనే విరాట్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 85/2. క్రీజులో కోహ్లితో పాటు పాటిదార్(19) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్.. గ్రీన్ ఔట్
43 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గ్రీన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 50/2. క్రీజులో విరాట్ కోహ్లి(35), పాటిదార్(7) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కెప్టెన్ ఔట్
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. రబాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.క్రీజులో విరాట్ కోహ్లి(21), గ్రీన్(2) పరుగులతో ఉన్నారు.
ఆర్సీబీ టార్గెట్ 177 పరుగులు
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(27), శశాంక్ సింగ్(21) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్‌వెల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, దయాల్ తలా వికెట్ సాధించారు.
ఐదో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్
సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 132/4
16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(19), సామ్ కుర్రాన్(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్.. ధావన్ ఔట్
పంజాబ్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/4
మూడో వికెట్ డౌన్.. లివింగ్‌స్టోన్ ఔట్
98 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. జోషఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ డౌన్.. ప్రభుసిమ్రాన్ సింగ్ ఔట్
72 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 40/1
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(21), ప్రభుసిమ్రాన్(10) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..
17 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ప్రభుసిమ్రాన్ సింగ్ వచ్చాడు.
2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 9/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(8), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పలు లేకుండా బరిలోకి దిగాయి.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెప్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment