తొట్ట తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. బ్రబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట‍్ల తేడాతో ఓడించి ముంబై విజేతగా అవతరించింది. 132 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ కీలక పాత్ర పోషించింది.
60 పరుగులతో ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టును ఛాంపియన్స్‌గా నిలిపింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(37) కూడా ముంబై విజయంలో తమ వంతు పాత్ర పోషించింది. కాగా ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జానెసన్ తలా వికెట్ సాధించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీను రాధా యాదవ్, శిఖా పాండే అదుకున్నారు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 52 పరుగుల కీలక బాగస్వామ్యం నెలకొల్పారు.
రాధా యాదవ్(27), శిఖా పాండే(27) పరుగులు సాధించారు. అంతకు ముందు ఢిల్లీ కెప్టెన్ లానింగ్(35)పరుగులతో రాణించింది. ఇక ముంబై బౌలర్లలో వాంగ్, మాథ్యూస్ తలా మూడు వికెట్లు సాధించగా.. కేర్ రెండు వికెట్లు పడగొట్టింది.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. హర్మన్ ప్రీత్ ఔట్
95 పరుగుల వద్ద ముంబై కీలక వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ రూపంలో వెనుదిగిరిగింది. క్రీజులో స్కివర్(45), కేర్ ఉన్నారు. ముంబై విజయానికి 18 బంతుల్లో 26 పరుగులు కావాలి.
9 ఓవర్లకు ముంబై స్కోర్: 45/2
132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో స్కివర్(15), హర్మాన్ ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉన్నారు.
24 పరుగులకే 2 వికెట్లు కెల్పోయిన ముంబై
132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాధాయాదవ్ బౌలింగ్‌లో యస్తికా భాటియా(4) పెవిలియన్‌కు చేరగా.. జానెసన్ బౌలింగ్‌లో మాథ్యూస్(13) ఔటైంది. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 24/22
అదరగొట్టిన శిఖా, రాధా.. ముంబై టార్గెట్ 132 పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీను రాధా యాదవ్, శిఖా పాండే అదుకున్నారు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 52 పరుగుల కీలక బాగస్వామ్యం నెలకొల్పారు.
రాధా యాదవ్(27), శిఖా పాండే(27) పరుగులు సాధించారు. అంతకు ముందు ఢిల్లీ కెప్టెన్ లానింగ్(35)పరుగులతో రాణించింది. ఇక ముంబై బౌలర్లలో వాంగ్, మాథ్యూస్ తలా మూడు వికెట్లు సాధించగా.. కేర్ రెండు వికెట్లు పడగొట్టింది.
75 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ!
75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో శిఖా పాండే(1), మిన్ను మణి(1) పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు ఢిల్లీ బౌలర్లలో వాంగ్ మూడు వికెట్లు, అమీలియా కేర్ రెండు, మాథ్యూస్ ఒక్క వికెట్ సాధించారు.
నాలుగు వికెట్ కోల్పోయిన ఢిల్లీ
73 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కాప్.. కేర్ బౌలింగ్‌లో ఔటైంది.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
35 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్.. వాంగ్ బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.
12 పరుగులకే రెండు వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన వాంగ్ బౌలింగ్‌లో మూడో బంతికి షఫాలీ వర్మ పెవిలియన్‌కు చేరగా.. నాలుగో బంతికి క్యాప్సీ డకౌటయ్యంది. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 16/2
మహిళల ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. పూనమ్ యాదవ్ స్థానంలో మిన్ను మణి తుది జట్టులోకి వచ్చింది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నటాలీ స్కివెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ జింటిమణి కలిత
ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్ కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి
Comments
Please login to add a commentAdd a comment