IPL 2023: Mumbai Indians Will Wear MIS WPL Jersey for Today's Match vs KKR - Sakshi
Sakshi News home page

IPL 2023: కేకేఆర్‌తో మ్యాచ్‌.. మారనున్న ముంబై ఇండియన్స్‌ జెర్సీ

Published Sun, Apr 16 2023 12:35 PM | Last Updated on Sun, Apr 16 2023 1:11 PM

IPL 2023: Mumbai Indians Will Wear MIs WPL Jersey For Todays Match Vs KKR - Sakshi

Photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 16) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత ముంబైలోని వాంఖడేలో మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ధరించనున్న జెర్సీలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నాయి. ముంబై ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ESA (అందరికీ విద్య మరియు క్రీడలు) రోజులో భాగంగా ముంబై ఇండియన్స్‌ పురుషుల జట్టు మహిళల ఐపీఎల్‌ (WPL)లో ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ ధరించిన జెర్సీలను ధరించి బరిలోకి దిగుతుంది.

ఈ మ్యాచ్‌ను 19000 మంది అమ్మాయిలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంఐ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. WPL తొలి ఛాంపియన్స్‌ ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు హాజరయ్యే వారిలో ప్రత్యేక ఆకర్శణగా నిలువనుంది. మెన్స్‌ టీమ్‌ ఆటగాళ్లు వుమెన్స్‌ టీమ్‌ జెర్సీలు పట్టుకున్న ఫోటోలను ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. ఇందుకు స్పెషల్‌ జెర్సీ ఫర్‌ ESA డే అనే క్యాప్షన్‌ను జోడించింది.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌-2023లో ముంబై ఇండియన్స్‌ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్‌కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఆ జట్టులో నూతనోత్తేజం నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్‌ సేన అతికష్టం మీద ఆఖరి బంతికి విజయం సాధించినప్పటికీ, అన్ని విభాగాల్లో సత్తా చాటింది. సూర్యకుమార్‌ పేలవ ఫామ్‌ ఆ జట్టును కలవరపెడుతుంది. బ్యాటింగ్‌లో తిలక్‌ వర్మ, బౌలింగ్‌లో బెహ్రెన్‌డార్ఫ్‌ సత్తా చాటుతుండటం..  రోహిత్‌ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మొత్తానికి అరకొర బలగాలతో ముంబై ఇండియన్స్‌.. పటిష్టమైన కేకేఆర్‌ను ఎలా ఢీకొంటుందో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement