WPL 2023, MI Vs DC: Delhi Capitals Beat Mumbai Indians By 9 Wickets - Sakshi
Sakshi News home page

WPL 2023: ఢిల్లీ బౌలర్ల జోరు.. ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి

Published Mon, Mar 20 2023 10:03 PM | Last Updated on Tue, Mar 21 2023 8:32 AM

WPL 2023: Delhi Capitals Beat Mumbai Indians By 9 Wickets - Sakshi

డబ్ల్యూపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 20) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగా.. ఛేదనలో  షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, సిక్స్‌), మెగ్‌ లాన్నింగ్‌  (22 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), అలీస్‌ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్‌; ఫోర్‌, 5 సిక్సర్లు) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలీ వర్మ వికెట్‌ హేలీ మాథ్యూస్‌కు దక్కింది. ఈ విజయంతో డీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. 

అంతకుముందు మారిజన్‌ కాప్‌ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్‌ జొనాస్సెన్‌ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో ముంబై టీమ్‌ కనీసం 100 పరుగులు చేయడ​ం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌), ఇస్సీ వాంగ్‌ (24 బంతుల్లో 23, సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా అని ఎంఐ 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్‌ (5), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (0), అమేలియా కెర్‌ (8) విఫలమయ్యారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement