WPL 2023, RCB Vs DC: Who Is Tara Norris? USA Cricketer Dismantles RCB Line-Up - Sakshi
Sakshi News home page

WPL 2023: తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు.. కేవలం రూ.10 లక్షలు మాత్రమే! ఎవరీ తారా నోరిస్‌?

Published Sun, Mar 5 2023 9:30 PM | Last Updated on Mon, Mar 6 2023 8:47 AM

Who Is Tara Norris? USA Cricketer Dismantles RCB Line-up - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ తారా నోరిస్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీల్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి పేసర్‌గా నోరిస్ రికార్డులకెక్కింది. ఈ లీగ్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నోరిస్ ఈ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో నోరిస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.

కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 60 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగల్గింది.

అంతకుముందు షషాలీ వర్మ(84), లానింగ్‌(72) పరుగులతో అదరగొట్టడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నోరిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో అదరగొట్టిన తారా నోరిస్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

ఎవరీ తారా నోరిస్‌?
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై వేదికగా జరిగిన వేలంలో అమెరికా చెందిన 24 ఏళ్ల తారా నోరిస్‌ను 10 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. నోరిస్‌ తన జాతీయ​ జట్టు తరపున ఇప్పటి వరకు 5 టీ20లు ఆడింది. నోరిస్‌ ఇంగ్లండ్‌ దేశీవాళీ టోర్నీ రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో తన పేరును ప్రపంచానికి పరిచయం చేసింది. 2020 సీజన్‌లో సౌథర్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తారా.. 12 వికెట్లతో సత్తా చాటింది. ఆ ఏడాది సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా నిలిచింది.
చదవండి: కోహ్లి, సూర్య, బాబర్‌ కాదు.. అతడే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement