93 పరుగుల ఆధిక్యంలో వరంగల్‌ | 93 runs lead in the warangal | Sakshi
Sakshi News home page

93 పరుగుల ఆధిక్యంలో వరంగల్‌

Published Thu, Aug 11 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

93 runs lead in the warangal

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ మైదానంలో బుధవారం ప్రారంభమైన అంతర్‌ జిల్లాల టుడే లీగ్‌ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. వరంగల్‌ వర్సెస్‌ నిజామాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మెుదట నిజామాబాద్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే 35 ఓవర్లలో నిజామాబా ద్‌ జట్టు 89 పరుగులు సాధించి ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన వరంగల్‌ జట్టు సాయంత్రం వరకు జరిగిన ఆటలో 55 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు సాధించి నిజామాబాద్‌ జట్టుపై 93 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుం ది. వరంగల్‌ జట్టు క్రీడాకారుడు సోను బౌలింగ్‌లో ప్రతిభ కనబరిచి 6 వికెట్లను తీశాడు. సాయంత్రం వరకు సాగిన మ్యాచ్‌ లో సుఖాంత్‌ 59 పరుగులు, సాయిచరణ్‌ 89 పరుగులు చేశారు. గురువారం మ్యాచ్‌ కొనసాగుతుందని వరంగల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement