సింగపూర్ సిటీ: పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించే దిశగా భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అడుగు ముందుకు వేశాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల గుకేశ్ కేవలం 29 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించాడు.
వరుసగా ఏడు ‘డ్రా’ల తర్వాత ఫలితం రావడం విశేషం. ఈ గెలుపుతో గుకేశ్ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మిగిలిన మూడు గేమ్‌లను గుకేశ్ ‘డ్రా’ చేసుకుంటే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ అయిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.
11వ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన గుకేశ్ అశ్వంతో తొలి ఎత్తును వేయగా... లిరెన్ తొలి ఎత్తు నుంచే తప్పిదాలు చేసి చివరకు 29వ ఎత్తు వద్ద తన ఓటమిని అంగీకరించాడు. నేడు జరిగే 12వ గేమ్‌లో లిరెన్ తెల్లపావులతో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment