సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కీలకదశకు చేరుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్ c చైనాగ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో నేడు 13వ గేమ్ జరగనుంది. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లను నిర్వహించనుండగా... ఇప్పటికి 12 గేమ్‌లు ముగిశాయి.గుకేశ్, లిరెన్ చెరో రెండు గేముల్లో గెలిచారు.
మిగతా ఎనిమిది గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. వీరిద్దరు 6–6 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నేడు జరిగే 13వ గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ ఓపెనింగ్‌కు డిఫెండింగ్ చాంప్ లిరెన్ ఏ విధంగా జవాబు ఇస్తాడో చూడాలి. ఇప్పటికే ఒకసారి ప్రపంచ చాంపియన్ అయిన లిరెన్‌కు గత అనుభవం కలిసొచ్చే అవకాశముంది.
13వ గేమ్‌లో గుకేశ్ గెలిస్తే, చివరిదైన 14వ గేమ్‌లో లిరెన్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయినా, గుకేశ్ ఓడినా... చివరి గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్న లిరెన్‌కు పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment