
సింగపూర్ సిటీ: తొలి గేమ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రెండో గేమ్‌ను గుకేశ్ ‘డ్రా’ చేసుకున్నాడు.
23 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశాలు కనిపించకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్‌లో డింగ్ లిరెన్ గెలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి. రెండు గేమ్‌ల తర్వాత డింగ్ లిరెన్ 1.5–0.5తో గుకేశ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. నేడు జరిగే మూడో గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment