18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి నుంచి సామన్య ప్రజల వరకు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 14వ రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను ముద్దాడాడు.
గేమ్ చివరి క్షణాల్లో అద్బుతమైన ఎత్తుగడలతో చైనా గ్రాండ్ మాస్టర్‌ను గుకేశ్ చిత్తు చేశాడు. తద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో జగజ్జేతగా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మనీ లభించిందో ఓ లుక్కేద్దాం.
ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్ అందుకున్నాడు.
మొత్తంగా అతడికి రూ.16.52 కోట్ల ప్రైజ్‌మనీ లభిచింది. అదే విధంగా రన్నరప్ డింగ్ లిరెన్ 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మొత్తంగా చైనా గ్రాండ్ మాస్టర్ ఖాతాలో రూ.13.12 కోట్లు చేరాయి. కాగా మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కావడం గమనార్హం.
చదవండి: Chess World Championship: గుకేష్ విజయం వెనక వారిద్దరూ..
Comments
Please login to add a commentAdd a comment