ప్రపంచ చదరంగంలో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ కొత్త అధ్యయనాన్ని లిఖించాడు. సింగ్‌పూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా గ్రాండ్ మాస్టర్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
కేవలం 18 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. అద్బుతమైన చెక్‌మెట్‌లతో డిఫెండింగ్ ఛాంపియన్‌నే ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు.
కన్నీరు పెట్టుకున్న గుకేశ్..
ఆఖరి గేమ్‌లో విజయం ఖాయమైన అనంతరం గుకేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదరంగం బోర్డుపై పావులను సరిచేస్తూ గుకేశ్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గెలిచిన వెంటనే పక్కన వున్నవారు చప్పట్లు కొట్టి అభినందిచండంతో గుకేశ్ నవ్వుతూ కన్పించాడు.
ఆ తర్వాత తన సీట్ నుంచి లేచి విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను అతడు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెస్.కామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
🥹🎉 @photochess pic.twitter.com/BOnIsfKtIw
— Chess.com (@chesscom) December 12, 2024
గుకేశ్ తండ్రి టెన్షన్ టెన్షన్..
మరోవైపు లోపల ఫైనల్ గేమ్ జరుగుతుండగా గుకేశ్ తండ్రి రజనీకాంత్ సైతం తెగ టెన్షన్ పడ్డారు. గది బయట ఫోన్ చూసుకుంటూ అతడు ఆందోళనతో అటు ఇటు తిరుగుతూ కన్పించాడు. అయితే గుకేశ్ గెలిచిన వెంటనే రజనీకాంత్ అనందానికి అవధలు లేకుండా పోయాయి.
తన కొడుకుని ఆలింగనం చేసుకుంటూ గెలుపు సంబరాలు జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే విధంగా గుకేశ్ తన ఫ్యామిలీతో డ్యాన్స్ చేస్తున్న ఓ పాత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశాడు. "ఇప్పుడు యావత్ భారత్ మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తుందని" ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
♥️ Gukesh's dad after he realized that his son had won the World Championship 👇#GukeshDing #DingGukesh pic.twitter.com/0WCwRbmzmd
— Chess.com - India (@chesscom_in) December 12, 2024
All of India is dancing with you at this very moment @DGukesh ! #GukeshDing
pic.twitter.com/dEzYkCRaEz— anand mahindra (@anandmahindra) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment