సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14 గేమ్‌ల పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌న్ ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా.. నిర్ణయాత్మకమైన ఆఖరి పోరులో గుకేశ్ తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు.
అయితే ఆఖరి గేమ్ కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ గేమ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 32 ఏళ్ల లిరెన్ భారీ తప్పదం చేశాడు. 55వ ఎత్తుగడలో రూక్(ఏనుగు)ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. అతడి పేలవమైన మూవ్ చూసిన గుకేశ్ ఆశ్చర్యపోయాడు.
ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు. వెంటనే ఆ ఎనుగును తన ర్యాక్‌తో గుకేశ్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత ప్రత్యర్ధికి గుకేశ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపి తన విజయాన్ని గుకేశ్ లాంఛనం చేశాడు. అయితే గుకేశ్ విజయాన్ని యావత్తు భారత్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది.
"గుకేశ్, లిరెన్‌న్ మధ్య జరిగిన చివరి గేమ్ ఫలితం నిపుణులు, చదరంగం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిర్ణయాత్మక గేమ్‌లో చైనీస్ చెస్ ఆటగాడి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు.
అతడు ఓటమి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి" రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే ఆండ్రీ భారత్‌పై విషం చిమ్ముతున్నాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment