ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు | YS Jagan Congratulates Youngest Ever World Chess Champion Gukesh Dommaraju, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Published Thu, Dec 12 2024 9:05 PM | Last Updated on Fri, Dec 13 2024 11:48 AM

Ys Jagan Congratulates World Chess Champion Gukesh Dommaraju

సాక్షి, తాడేపల్లి: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుకేష్‌కు ఎక్స్‌ వేదికగా విషెస్‌ చెప్పారు. ‘‘18 ఏళ్ల వయసులోనే గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా చరిత్రకెక్కారు. గుకేష్ తెలుగు రాష్ట్రానికి చెందినవాడు కావటం మనందరికీ గర్వకారణం. ఎంతోమంది యువకులకు ఆయన స్ఫుర్తిగా నిలిచారు. భవిష్యత్తులో కూడా గుకేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు.

వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్‌ ప్రస్తుత ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్‌ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్‌ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడు. వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్‌ రికార్డు నెలకొల్పాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement